దోచబడిన సమిష్టి వాదంతో

దోచబడిన సమిష్టి వాదంతో

 

దిక్కుతోచని మారణహోమపు
ప్రాపంచీ కరణాలతో తలచిన ధ్యేయం
వదిలిన ఆశలుగా తర్పణమవుతు…
ఆత్మవంచనతో గుర్తించని స్థానం
నీరెండిన భావనగా…ఏమూలని పిలిచినా
దిక్కౌతానని నీ అడుగులకు
మడుగులొత్తదు…

మబ్బు సమీకరణాలతో చుట్టముట్టిన
విషతుల్యాల ధోరణి ధ్వారపు ధ్వజాలై…
తనలో మునిగిన తేజం సూర్యోదయంగా
మింగుడు బడక…. కుబుసంగా వదిలిన
చీకటి అజ్ఞానం వెలుగు చేసిన స్పర్శతో
కాలిపోతు లోకం పరిచయాలను
కుడి ఎడమలుగా పంచుతుంది….

పొడబారిన పరస్థితులు సంస్కృతిచే
లిఖించబడవు…ప్రయత్నం సాధనలై
ఆశపడని ఒకరి సహకారం తోడును
నడిపిస్తుందని ఎదురు చూడక…
ఈ యుగ ప్రయానం మనిషి జీవితానికి
ఒక సత్కారమని స్వీకరించిన మనస్సుతో
చావు పుట్టుకలున్నాయని…భయపడకు
బెదిరని మనస్సుతో కాపాడుకో…

దోచబడిన సమిష్టి వాదంతో…
నీ కొరిగేది లేదని నియమం లేని నీతులతో
ఓర్పున గుణపాటాలను అతివాద
దురాగతాలకు గురిచేయక… నువ్వేలే
బతుకును అక్షరాల మోసం చేసూకొంటు
సుర్యోదయం లేని బతుకు చాపల్యాన్ని
చాప క్రింద నీరుగా పారిస్తు నీవుగా
దిగజారిపోకు…

బతికిన కాలంతో బలిగొన్న రూపం
వెనకాల…దగాపడ్డ జీవితాల ఉద్దరణ కై
పాటుపడు తీరని ఆవేదనని దినసరి
చర్యగా నెమరు వేసుకొంటు…
ఎవరు సంఘీభావం చూపలేక పోయినా…
నిత్యానికి నీవే సమాదానమై చారెడంత
మానవత్వం లేని మనుషులున్న లోకంలో
నీ హృదయ రాగాన్ని ఓపికతో వినిపించు….

 

-దేరంగుల భైరవ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *