దోచాయి
నేను అతణ్ణి ..
చూసినప్పుడు..
నా మనసు ..
నన్ను కవ్వించింది..
ఆ అందమైన కళ్లు..
నన్నే చూస్తుంటె..
నాలో ఆనందం..
పరవళ్లు తొక్కింది..
ఆ పెదవులు..
నన్ను బాగా ..
ఆకర్షించాయి..చూపుల మెరుపులు కూడా..
ఆ కళ్ల వెలుగు..
పెదవుల నవ్వు..
ముసి ముసి నవ్వులు..
నా మదిని దోచాయి..
ఇక ఊరుకుంటుందా..
నా మనసు..
ప్రేమించింది..
కవ్వించకే ఓ నా ప్రేమా..
అన్నాను నేను..
ఆ గుండుగాడు..
బోసి నవ్వులు నవ్వాడు..
నన్ను చూసి వాడే నా..
మనవడు రాముగాడు..
-ఉమాదేవి ఎర్రం