ధర్మాన్నిరక్షించాలి
కృతయుగంలో నాలుగు పాదాలతో నడిచేది ధర్మం.
త్రేతాయుగంలో మూడు
పాదాలతో నడిచింది ధర్మం.
ద్వాపర యుగంలో
రెండు పాదాలతో నడిచింది.
కలియుగంలో ఒంటి కాలితో నడుస్తోంది మన ధర్మం.
అప్పుడూ అధర్మం జరిగింది.
ఇప్పుడూ అదే జరుగుతోంది.
ధర్మాన్ని రక్షించుకోవాలంటే
అధర్మాన్ని దరి చేరనివ్వకు.
సమాజంతో కలసి బ్రతుకు.
సమాజం కోసమే బ్రతుకు.
అదే జీవిత పరమార్థం.
ధర్మో రక్షతి రక్షితః
అన్న వాల్మీకిని అనుసరిద్దాం.
-వెంకట భానుప్రసాద్ చలసాని