ధరలు తీగలా పెరగడం
కరోనా పుణ్యమా నన్నట్లు,
జీవనాధారం కోల్పోవడం..!
ఇక జీవితమే ఒకవిధమైన శిక్ష లా
అనుభూతి పొందిన వేళ..!
ఎవరితో చెప్పుకోవాలి..!?
ఏమని అడుక్కోవాలి..!??
ఆత్మాభిమానం అడ్డుకట్టలా నిలుస్తోంది..!
మధ్యతరగతి జీవితాల్లో ఆకలి అగ్ని కన్నా,
స్వీయ ఆత్మాభిమానం మిన్న..!
ఆ హితబోధ ను మది మరీ, మరీ బోధిస్తోంది..!
పీఠ మెక్కడమే తెలుసు నన్నట్లు,
పట్టింపు లేని పాలకుల నిరంకుశత్వానికి,
మౌనమే ఇక మిగిలింది..!
-భరద్వాజ్
అప్పటి పరిస్థితిని చక్కగా వివరించారు.