ధైర్యాన్నితెచ్చుకోవాలి
వ్యాపారం చెయ్యాలని నిర్ణయం తీసుకున్న సారధిని అందరూ నిరుత్సాహపరిచారు.
అంత పెట్టుబడి పెట్టి వ్యాపారం
చేయటం రిస్క్ అని మితృలు
కూడా చెప్పారు. సారథి మాత్రం
పూర్తి కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు.
తను చేయబోయే వ్యాపారం
గురించి పూర్తిగా స్టడీ చేసాడు.
అందుకే అతనికి అంత ఆత్మ
విశ్వాసం. ఇతరులు చెప్పే
మాటలు వినటం మానేసి
బిజినెస్ ఎలా పెట్టాలో ప్లాన్
చేయసాగాడు. బ్యాంకు
లోను కోసం ప్రయత్నాలు
మొదలుపెట్టాడు. బాగా
చదువుకున్నవాడు అవటం
వల్ల బ్యాంకు వాళ్ళు అతనికి
లోన్ ఇస్తామని హామీ ఇచ్చారు.
ఆ తర్వాత లోన్ కూడా ఇచ్చారు. ఆ డబ్బులతో
వ్యాపారం మొదలుపెట్టాడు.
మూడు పువ్వులు ఆరు
కాయలుగా అతని యొక్క
వ్యాపారం అభివృద్ధి చెందింది.
ఇప్పుడంతా సారధిని మెచ్చుకోవటం మొదలుపెట్టారు. అదే కనుక
అతను ధైర్యం చేయ్యకపోయి
ఉంటే ఏదో మామూలు ఉద్యోగం చేసుకుంటూ
జీవితాన్ని గడిపేవాడు.
అతని ధైర్యమే అతనికి
సిరి సంపదలను ఇచ్చింది.
-వెంకట భానుప్రసాదు చలసాని