దెయ్యం పిలిచింది
మహేష్ సెకండ్ షో సినిమాకు
వెళ్ళాడు. ఆ రోజు అమావాస్య
కూడా కావటంతో చుట్టూ చిమ్మ
చీకటి నెలకొని ఉంది. సినిమా
అయిపోయాక సినిమా హాల్
నుండి బయటకు వచ్చాడు.
పాత సినిమా అవటం వలన
పెద్దగా జనాలు లేరు. మహేష్
పార్కింగ్ నుండి తన బైక్
తీసుకుని ఇంటికి బయలుదేరి
వెళ్ళసాగాడు. ధియేటర్ నుండి
ఇంటికి పది కిలోమీటర్ల దూరం
ఉంటుంది. ఒక చిట్టడవిగుండా
వెళ్ళాలి. ఆ ప్రాంతంలో చాలా దెయ్యాలు తిరుగుతూ ఉంటాయి అని ప్రజలు నమ్మేవారు. కరెక్టుగా అడవి
మధ్యలోకి వెళ్ళిన మహేష్
బైక్ ఆగిపోయింది. బండిలో
పెట్రోల్ ఉంది. పైగా రెండు
రోజుల క్రితమే బండి యొక్క
సర్వీసింగ్ చేయించాడు. అయినా బండి ఎందుకో
ఆగిపోయింది. చుట్టూ చిమ్మ చీకటి. అంత చలిలోనూ మహేష్ కు చెమట పట్టడం
మొదలైంది. వెన్నులో భయం
మెల్లగా తలకు పాకుతోంది.
బండిని తోసుకుంటూ తన
గ్యామం వైపుకు వేగంగా బయలుదేరాడు. ఇంతలో
వెనక నుండి “బాబూ మహేష్”
అని ఎవరో పిలిచినట్లు అనిపించింది మహేష్ కు.
మహేష్ భయంతో ఇంకా వేగంగా బండిని తోసుకుని
వెళ్ళసాగాడు. మళ్ళీ అదే
పిలుపు. వెంటనే బండి
అక్కడే వదిలేసి తన ఇంటి
వైపు పరిగెత్త సాగాడు మహేష్.
మళ్ళీ అదే పిలుపు. మహేష్
ఎంత వేగంగా పరిగెత్తినా వెంటే
ఉన్నట్లు పిలుపు చాలా దగ్గరగా
వినవచ్చింది. మహేష్ వెనుతిరిగకుండానే గట్టిగా
“నన్ను వదిలేయండి”
అరవసాగాడు. ఆ ఆకారం
దగ్గరకు వచ్చేసింది. ఒంటి
మీద చెయ్యి వేసింది. కెవ్వు
మని కేక వేసి మూర్చపోయాడు
మహేష్. ఎవరో తట్టి లేపుతూ
ఉన్నట్లు అనిపించటం వల్ల
ఉలిక్కిపడి లేచాడు. ఆ తట్టి లేపింది అతని భార్య. ఎంత
భయంకరమైన పీడ కలో కదా.
ఇలాంటి పీడకల కనుక పెద్ద వయసులో వారికి వస్తే వారి
గుండె ఆగిపోవటం ఖాయం.
-వెంకట భానుప్రసాద్ చలసాని