దేవుడు
ఆది మానవుడు నుంచి నేటి
నవ మానవుడి వరకూ
ఆకలి తోడుగానే వుంది.
ఆకలి వల్లే వేట మొదలుపెట్టాడు.
బాట కనిపెట్టాడు. నిప్పు కనిపెట్టాడు.
నీడ కోరుకున్నాడు.
ఆకలి పేదోడి ఇంట అనాధ.
పెద్దోళ్ళ ఇంట రాజు.
ఆకలి లేని మనిషి అభివృద్ధి చెందలేడు.
ఆకలి విలువ తెలియనివాడు మనిషి విలువ అసలే తెలుసుకోలేడు.
ఆకలి కొందరికి ఆత్మబంధువు.
ఎన్నో జీవిత పాఠాలు నేర్పించే గురువు.
దయాహృదయాలను కలిచి వేసేది
ఆకలితో అలమటించే జీవితాలు.
ఆకలి అనుభవం మనిషిగా లేకపోయినా,
మనసున్న మనుషులకు ఎదుటవారి ఆకలిని తెలుసుకుంటారు.
ఒకరి ఆకలి తీర్చిన వాడే దేవుడు.
– రాధికా. బడేటి