దేవి అలక
నింగికెగిసిన నక్షత్రానివి నీవు..
నా పలుకుల భావానికి అర్థం నీవు…
నా రచనానంద గమ్యం
నీవు..
నా కలం నుండి జాలు వారే అక్షరానివి నీవు..
నా మదిలో విరబూసిన చామంతివి నీవు…
నా హృదయ మందిర నిర్మల జ్యోతివి నీవు…
ఏమీ తెలియని నాకు
నీ అందచందాలతో వయ్యారాలలోలుకబోస్తూ మైమరిపిస్తూ…
కవిత్వాన్ని పలికించే కవిని చేశావు.
కలపరపాటుతో చిన్న తప్పిదము చేస్తే..
అంతలోనే మూతి ముడుచుకొని మౌనం వహిస్తే ఎలా దేవి…
ఓ బంగారు వన్నెల చిలక
నీవు నన్ను ఎంత దూరం
పెట్టిన పెదవి విప్పేంత వరకు పలికిస్తూనే ఉంటా..
నీకోసం నేను గోరింకనై స్వేచ్ఛగా విహరిస్తూ
ఆకాశం నా సొంతం చేసుకుని
ఆ ఇంద్రధనస్సును నీకు బహుమతిగా తెచ్చి ఇవ్వనా..
ఇకనైనా అలకమాని
నాపై జాలి చూపించవోయ్…
నిరంతరం నీ మాట జవదాటకుండా ఆరాధించే నేస్తాన్ని నేను..
అభయ హస్తాన్ని ఇస్తున్న
కరుణించి మన్నించవోయ్👏
– శైల