దేశిరాగం
అశాశ్వత జీవితంలో
శాశ్వత శత్రుత్వం అవసరమా
భరోసా లేని జీవితంలో
మూతి బిగింపులు అవసరమా
జీవిత యవనికపై
మన పాత్రను
హాయిగా పోషిద్దాం
కోపాలు తాపాలు నిషిద్దం చేద్దాం
బంధాలను,అనుబంధాలను వేదిక చేద్దాం
కరిగే ప్రతి క్షణం
మనకో హెచ్చరిక
ద్వేష రాగం వదిలేసి
దేశి రాగాన్ని ఎంచుకోవటానికి
కాలాన్ని ఎదిరించొద్దు
కాలాన్ని ప్రేమ కౌగిలిలో బంధిద్దాం
మనం కనుమరుగవుతుంటే
కాలమూ కన్నీరు కార్చుతుంది
కాపాడలేకపోయానని తలదించుకుంటుంది
-సి.యస్.రాంబాబు