దేశాభిమానం
రవి ఒక ఆదర్శ విద్యార్థి.
చక్కగా చదువుకొని సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలని అనుకున్నాడు. అలా దేశభక్తిని ప్రకటించుకోవాలి అని అనుకున్నాడు. అయితే శారీరకంగా బలహీనుడు కావటంతో సైన్యంలో ఉద్యోగం రాలేదు.
అప్పుడు అతను గురువుగారికి తన బాధను చెప్పుకున్నాడు. గురువుగారు రవితో”దేశభక్తి చూపించడం అంటే కేవలం సైన్యంలో చేరి దేశాన్ని కాపాడటమే కాదు, ఏ ఉద్యోగం చేసినా దేశానికివన్నె తెచ్చే విధంగా పని చేయాలి. భారతీయులందరికీ మంచి జరుగేలా చూడాలి.
అది కూడా దేశభక్తే. నేనుఉపాధ్యాయుడిగా నా బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తున్నారు. పిల్లల మనసులో దేశభక్తి పెంచేందుకు నా వంతు కృషి చేస్తున్నాను. నా దృష్టిలో ఇది కూడా దేశభక్తే.అలాగే మన సమాజంలో ఉన్నఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లుమొదలయినవారంతా దేశానికితమ వంతు సేవ చేస్తున్నారు.
ఒక కవిగారు అన్నట్లు దేశమంటే కేవలం మట్టేకాదు. దేశమంటే అందులో నివసించేమనుషులు కూడా. మన తోటి భారతీయిలకు సేవ చేయటం నా దృష్టిలో దేశభక్తే. అందుకే సైన్యంలో ఉద్యోగం రాలేదని ఏ మాత్రం బాధపడవద్దు.
నువ్వు నేర్చుకున్న జ్ఞానం భారతీయులందరికీ ఉపయోగ పడేలా చూడు. అలా చేసినువ్వు కూడా నీ యొక్క దేశభక్తిని ప్రకటించుకోవచ్చు.”అని అన్నాడు. గురువుగారిమాటలు రవి మనసులోఉత్సాహాన్ని నింపాయి. ఆరోజు నుండి తన చుట్టూ ఉండే సమాజానికి తలలోనాలుకగా మసలుకోసాగాడు.దేశాభివృద్ధికి తన వంతు కృషి చేసి తన దేశాభిమానం
ప్రకటించుకున్నాడు.
-వెంకట భానుప్రసాద్ చలసాని