దేశభక్తి

దేశభక్తి

 

డెబ్భై ఐదేళ్ళుగా
అవినీతితో,
అన్యాయాలతో
రాజకీయాలతో
హత్యాచారాలతో
పారుతున్న
అమాయకుల
నెత్తుటిలో
ఎంత వెతికిన
దొరకని
దేశభక్తిని..
ఏడాదికొకసారి
ఆకలితో అజ్ఞాతంగా
చిక్కిశల్యమైన దేశాన్ని
స్వాతంత్ర్యంగా
వెలికి తీయడమే
ఆగస్ట్ పదిహేను..

 

-గంధం గురువర్ధన్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *