దేశ గౌరవం
దేశాన్ని ప్రేమిస్తూ
దేశ గౌరవాన్ని పెంచుతూ
జాతీయ జెండా ని గౌరవిస్తూ
ఎందరో మహానుభావుడు అర్పించిన ఫలితానికి
దేశ సైనికులను గౌరవిస్తూ
ఒక పౌరుడిగా దేశ రక్షణను కాపాడుతూ
భారతదేశంలో పుట్టినందుకు గర్విస్తూ
భారతమాత ముద్దు బిడ్డగా ఎదుగుతూ
దేశం పట్ల బాధ్యత వహిస్తూ
దేశంలో అందరిని ప్రేమగా చూసుకుంటూ
దేశ సైనికులు దేశాన్ని , ప్రజలను ఎల్లవేళలా కాపాడుకుంటూ
భారతమాత రుణాన్ని తీర్చుకోవడానికి
రెపరెపలాడే ఎగురుతున్న జెండాను చూసి
దేశ సైనికులు ప్రాణాలు త్యాగం చేస్తున్నారు..
దేశంపై చెడు దృష్టి సారించే ఉగ్రవాదులను
చంపుతూ
దేశభక్తి ఉన్నట్లు నటించే కొందరిని గుర్తిస్తూ
దేశానికి పట్టిన చీడపురుగులను తొలిచేస్తూ
వారి భారతం పడుతూ దేశభక్తిని చాటు చెప్తున్నారు..
దేశానికి స్వాతంత్ర తీసుకొచ్చిన ఎందరో మహానుభావులను గుర్తు చేసుకుంటూ
జాతీయ జెండాని ఎగరవేసి మన దేశభక్తిని చాటి చెప్పుకుందాం..
అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు..
-మాధవి కాళ్ల