దేశ భాషలందు తెలుగు లెస్స
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ సందర్భంలో…
సేకరించెనొక తేనెటీగ
సంస్కృతమను పుష్పమందు
మకరంద మను తెలుగు భాష
పట్టు పెట్టి పదిల పరచె
తెలుగు ప్రజల గుండెల్లోన…
ఆదికవి పలికిన ఆ తేనె భాష
పలుకుచుండె తెలుగునోట
విశ్వమంతా విస్తరించే
పలికినంత సాయి నోట…
దేశ భాషలందు తెలుగు లెస్స
అన్న రాయలు
వేష భాషలందు తెలుగు మిన్న
అన్న మన సంస్కృతి.
– రమణ మూర్తి