దేని కోసమో ఈ ఆరాటం?
కన్నవారిని గాలికి వదిలేసి…
కట్టుకున్న భార్య చేతిలో
కీలుబొమ్మగా మారి…
అడ్డ దారులు తొక్కుతూ,
ఉద్యోగంలో ఎంత పైకి ఎదిగినా…
పిల్లలకు పెద్ద వారిపై ప్రేమాభిమానాలను
పెంచాల్సింది పోయి, డబ్బు మీద
మమకారాన్ని పెంచుతున్నా…
మనసును బండరాయిగా మార్చేసి
,పై పైన మెరుగులతో మెరిసిపోయే శరీరాన్ని ప్రేమిస్తున్నా…
నీ వ్యక్తిత్వాన్ని కోల్పోయినా …
నీ ఔన్నత్యాన్ని చాటుకోలేకపోయినా…
చివరికి చేరాల్సింది ఆ ఒలుకుల మట్టిలోకే కదా…
నీకై వేచి ఉన్న ఆ ఆరడుగుల గోతిలోకే కదా…
అలాంటప్పుడు ఎందుకు నీకీ లేనిపోని అత్యాశలు…
మనిషిలోని అహాన్ని పెంచే డబ్బు
లాంటి వ్యసనాల పై వ్యామోహాలు…
నీది కానిదానికోసం ఆరాటపడుతూ…
నిన్ను నీవే కోల్పోయిన పట్టించుకోక ఇలా చేస్తూనే ఉంటావా ….
అన్యాయాలను అక్రమాలను కాటికి చేరే చివరి రోజు వరకు.
-హైమ
చాలా బాగా రాసారు హైమ గారు 👌👌👌👌👌👌💐💐💐💐💐💐💐💐💐💐