డియర్
ఈ రోజు ఈ అంశం మీద కాకుండా వేరేది రాయలేను ఈ రోజు నా డియర్ 4వ సంవత్సరికం చాలా బాధగా వుంది చెప్పడానికి.
ఎందుకంటే మా అమ్మ తర్వాత ఆమె నాకు మార్గదర్శి ఇంకా సహణశీలి ఆమె. నేను అంటే ఆమెకు చాలా ఇష్టం నాకు ఆమె అంటే గౌరవం అంతే ఆమెకు కూతురు లేదు. ఆమెను నేను అర్ధంచేసుకున్నాను నన్ను ఆమె నన్ను ఆదరించింది. ఆమెకి నేను రెండవ కోడలు.
డియర్ అంటే మా అత్తగారు నేను అత్తయ్య అంటాను. మా కూతురు వాళ్ళ నానమ్మని డియర్ అని పేరు పెట్టింది అప్పటినుండి నన్ను మీ డియర్ ఎం చేస్తుంది అని అంటూ వుండేది.
ఎందుకే అలా అంటావ్ అంటే మీ అత్త కదా అమ్మ అంటూ ఉంటుంది. 28 ఏళ్ల లో ఆమె నేను ఒక్క మాట కూడా అనుకోని బాధ పడ్డ సంఘటనలు లేవు.
ఈ విషయానికి నేను చాలా గర్వపడుతున్నాను. నా అదృష్టంగా భావిస్తాను. మా వాళ్ళు అందరూ అనేవాళ్ళు ఇలా కూడా అత్తా కోడళ్ళు వుంటారా అని. మా కూతురు కూడా డియర్ కి ఏం ఇబ్బంది కాకుండా చుస్కోవాలసిన భాద్యత మనదే అమ్మా అని చెప్పేది.
అంతే ఇంకా ఏమి చెప్పలేను కాకపోతే ఈ విషయం పంచుకోవా లా వద్దా అని సందేహిస్తున్నాను. నా డియర్ కి ఇష్టమున్నవి వండి నైవైద్యం పెట్టాను. ఆమె లేని లోటు తీరదు కదా……
– జి జయ