డైరీ
వెళ్లిపోయిన క్షణాలను
వెతికి పట్టి తెల్లని కాగితం
పై గులక రాళ్ళ లాంటి
అనుభవాల అక్షరాల
అంతరంగ భావాల
పట్టికనే డైరీ .
సంవత్సరానికి సరిపడా
పేజీలతో నేస్తమై
వేచి చూసి నీవు చేసిన తప్పులను తరచుకుం టూ
నిఘంటువు గా నీ దగ్గరే
ఉండి
జ్ఞాపకాల గమ్మత్తులైనా
కన్నీటి కష్టాలైనా
గడచిపోయింది రోజులైనా
గాయపరిచిన మనిషులైనా
భావాల భంగిమ లైనా
మనసుపడే మూగ బాధైనా
ఒత్తిడి లో వూగిన సమయమైనా
భారమనిపించే గుండె బరువైనా
సందేహాల సంగతులైనా
చడీచప్పుడూ కానీ
స్వార్థమైనా
బంధాల బరువులైనా
బదులివ్వని మాటలైనా
విషా దపు ఛాయలై నా
విజయాల విన్నపం అయినా
నిజాన్ని నిశబ్దంగా
నీకు తెలిపే నిధి ఉందని
తెలుసుకునే అవకాశం
ప్రాపంచిక విషయా లైనా
సిరా చుక్కల రూపంలో
సాక్షిగా ప్రతిబింబించే
నీకు నువ్వుగా రాసుకున్న
నిదర్శన గ్రంధం డైరీ …..
– జి జయ