కరోనా నుండి కాపాడుకుందాం
కలం చెరిగిపోదు
గళం ఆగిపోదు
సూర్యబింబం వెలుగు ఆగిపోదు
సంతోషం తరిగిపోదు
ఆటపాటలు సమసిపోవు
మెండైన కీర్తి తొలగిపోదు
కన్నీరు రాలిపోతే
కష్టాలు ఏరులైపోతే
ఇంకెప్పుడు ఉంది కరోనా సోకదని
కలి విజృంభన చేస్తే
ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తే
రాశులతో సవాలు గతి తగలెట్టడమే జరిగితే
ఎవరు ఆపగలరు
రాక్షసమని భూత పిశాచిని సైతం
సాని టైజర్, మాస్కులు ధరించాలి
ఆపై దైవానుగ్రహం పొందాలి
పోరాడుదాం కడవరకు వ్యాధితో
మానవత్వంతో మనుషులను కాపు కాయడంతో
విప్లవం కరోనా పై జోడిద్దాం
కరుణ లేని ఈ వ్యాధి నీ అంతం చేద్దాం
-యడ్ల శ్రీనివాసరావు
Baga chepparu 👌👌👌👌