కరోనా జాగ్రత్తలు ఆటవెలదులు

కరోనా జాగ్రత్తలు ఆటవెలదులు

 

బయటకెళ్ళునపుడు బాధ్యత మరువకు
మాస్కును ధరియించు మంచిదౌను
దూరముండ వలెను దుష్ట కరోనకు
టీక వేయువరకు తిరుగ రాదు.

బాలవాక్కులన్ని బ్రహ్మ వాక్కు లంటు
భేదమనకచెప్పె వేదవాక్కు
భావిపౌరులైన పసివారి పనిపట్ట
కసికరోన ముందుకరుగు చుండె.

మానవత్వ మంత మంటగలుపుచుండె
మనసు కరుగదీ కరోన కేమి
బతికి యున్ననాటి బంగారు బంధాలు
మానవ మనుగడకు మచ్చ తెచ్చె.

తల్లి దండ్రి లేక తల్లడిల్లెడివారు
అమ్మ పాలు దాగ అరచువారు
ఆదరించుఅమ్మ ఆనవాలు గనక
దీనులై వెదికిరి దిక్కు లేక.

ఒకరు వదిలిన గాలి నొకరు పీల్చిన వచ్చు
మాయదీకరోన మరువ వద్దు
రక్త నాళములకు శక్తి మార్గము మూయు
ప్రాణ వాయువింక పారిపోవు.

మాదీ కరోన మాయమయ్యేదాక
మనము యింటియందె మసలవలయు
దూరబంధువంటు దర్శించ వచ్చినా
ఆత్మ బంధువంటు హత్తుకోకు.

ఆకలి కడుపులకు అలసటతోడాయె
కాళ్ళు నడవలేక కూలబడెను
కళ్ళుతిరుగుడాయె కడుపులో మంటలు
మానవత్వమంత మూగబోయె.

– కోట పెంటయ్య

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *