కాంక్రీటు మనిషి
జారే చినుకులు మట్టి మదిలో…
ఎన్నో ప్రశ్నలకు జీవం పోస్తుంటే…
ఆలోచనల ఎరువులను అతను చల్లి….
పెంచి పోషిస్తున్నాడు… వేళ్లూనుకునేలా…
అర్థంపర్థం లేని అనుమానాలు
పిల్లకాలువలై… అతని మనసు మైదానంలో..
నెర్రెలు బారిన నేల గుండా ప్రవహిస్తున్నాయి
ఆగధాన్ని …గొయ్యిలా మారుద్ధమని కాబోలు
దోసిల్లలోని ఆఘ్రాణిత గగన కుసుమలను…
హృదయపు ముత్యపు చిప్పలో దాచుకోనక
మేఘాలతో జతకట్టి వచ్చవాని… చీదరించి
వీధి పాలు చేశాడతను..వెర్రితో…
ఫలితం తన ముందు… విశాల నది తీరమై
ఆమె నిలిచి… ఎందరినో ఆదుకుంటూ…
సాగిపోతుంది… నిశ్చల జీవనవహినిలా…
మనో అంతరాలను ప్రక్షాళన చేస్తూ….
చివరికి అతడు ఒంటరిలా మిగిలాడు…
అవును అతనెవరో?…తెలుసునా
స్వచ్ఛమైన నీటి చినుకును ఆస్వాదించలేని..
సిమెంటుతో ఒళ్ళంతా చుట్టుకున్న నాగరికత
నేర్చిన ఓ మనిషి….
– కవనవల్లి (సాయిప్రియ బట్టు)