కాలేజ్
కాలం వెనక్కి తిరిగితే! నేనూ వెనక్కే తిరుగుతా!
అందమైన నా కాలేజ్ డేస్ కి వెళతా!
అవి అత్యధ్బుతమైన గోల్టెన్ డేస్!
నా కాలేజ్ అంటే నాకు చాలా ఇష్టం ఉండదా! మరి మంచి కవయిత్రినని
మంచి రచయిత్రినని నాకు చాలా గుర్తింపు నిచ్చింది..
మా కాలేజ్ మాగజైన్లో నావే రచనలు కాకపోతే అప్పుడు నా కలం పేరు అరుణ కాంతి..
ఇప్పుడు ఆ పేరుతో రాయడం లేదు..
నా రచనలు నేను అచ్చులో చూసుకున్న రోజులు..
వీక్లీలలో మంత్లీలలో అచ్చులో చూసి ఎంత సంబర పడ్డానో! ఆ రోజుల్లోకి వెళ్లాలనుంది..
నా మదిలోని జ్ఞాపకాలలో ఎప్పుడూ వెళుతూనె ఉంటాను కానీ.. అప్పుడు మీ రందరూ లేరు కదా!
ఇప్పుడయితే మీతో కలిసి వెళదామని చిన్ని ఆశ…
అమ్మెా! ఆశ,దోశ అప్పడం వడ అంటున్నారు కదూ!
అంటారు మరి అనకేం చేస్తారు? నాది చిన్ని ఆశ కాదు అత్యాశ అయితేనూ…
కాలం వెనక్కి జరగడం అసంభవమని తెలిసినా మనిషి ఆశ పరుడు కదా!అందుకే నేను కూడా అంతే!!
-ఉమాదేవి ఎర్రం