చివరి చూపు
నాలుగేళ్ల క్రితం పెళ్లి జరిగింది నందిని కి మంచి సంబంధం, బాగా ఉన్నవారు, సంస్కారవంతులు అని తెలిసి నందిని తల్లిదండ్రులు నందిని కి ఘనంగా పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత నందిని భర్గ వాసు తో చాలా సంతోషంగా ఉంది.
ప్రేమ తర్వాత పెళ్లి అనేది ఎలా ఉంటుందో కానీ పెళ్లి తర్వాత ప్రేమ అనేది చాలా బాగుంటుంది. అప్పటి వరకు ఎవరో తెలియని వ్యక్తిని పెళ్లి చేసుకుని అతన్ని, అతని కుటుంబాన్ని ప్రేమించడం కొత్తగా ఉంటుంది.
నందిని కూడా అలాగే అనుకుంది. భర్తను, అత్తా మామలని తన వాళ్లనుకుని వారిని బాగా చూసుకుంటుంది. వాళ్ళు కూడా నందినికి చాలా గౌరవంగా, ప్రేమ ఆప్యాయతలు పంచుతూ ఉన్నారు. ఈ నాలుగేళ్ల లో నందిని లేకుండా వాళ్ళు ఉండలేని స్థితికి వచ్చారు.
నందు బాక్స్ రెడీ నా అంటూ వచ్చాడు వాసు హా వస్తున్నా అంటూ ఒక చేత్తో బాక్స్ ఇంకో చేత్తో టిఫిన్ ప్లేట్ తో వచ్చిన నందు ను చూస్తూ వాసు కిసుక్కున నవ్వాడు.
ఎంటి నవ్వుతున్నారు నా మొహం పైన కోతులేమన్న అడుతున్నాటా అంది బుంగమూతి పెడుతూ, ఆ మూతి చూడగానే గబుక్కున దగ్గరికి వచ్చి చటుక్కున పెదాలు కొరికేసాడు. ఛీ ఏంటండీ ఇది ఎవరన్నా చూస్తే ఎలా అంటూ వెనక్కి జరిగింది నందిని.
అంటే ఎవరు చూడకుంటే నీకు సమ్మతమే కదా అంటూ వాసు కన్ను కొట్టాడు. చాల్లెండి సరసం దీనికేం తక్కువ లేదు. కానీ ఇప్పటి వరకు నన్ను హడావుడి పెట్టీ ఇప్పుడు తీరికగా ఇలా చేయడం మీకు తగునా…
పదండి ఆఫీస్ కు ఆలస్యం అవుతుంది. అంటూ చేతిలో బాక్స్ పెట్టేసి భుజాల పైన చేతులు వేసి ముందుకు తోసింది నందు. రాక్షసి నీ పని రాత్రికి చెప్తాలే అంటూ నవ్వుతూ బైక్ స్టార్ట్ చేసి బై చెప్పాడు వాసు.
ఏమ్మా వాసు వెళ్ళాడా అంటూ వచ్చింది నందిని అత్తగారు హైమావతి. హా వెళ్లారు అత్తయ్య మీకు కాపీ తేనా అంటూ అడిగింది నందిని. మీ మామగారికి నాకు ఇవ్వమ్మ అంటూ చెప్పి, నేను స్నానానికి వెళ్తున్నా అంటూ బట్టలు తీసుకుని వెళ్ళింది హైమవతి.
సరే అత్తయ్య అంటూ వంట గది లోకి వెళ్ళింది నందినిని మామగారికి కాఫీ ఇవ్వడానికి. కాసేపయ్యాక హైమావతి గారు స్నానం చేసి బయటకు వచ్చారు. అంతలోనే నందిని మామయ్యగారు లోపలికి వస్తూ హైమా కాఫీ అనే వెళ్లావు ఇంకా తీసుకురాలేదు అంటూ లోపలికి వస్తూ పిలిచారు.
అయ్యో అదేమిటండీ నేను నందినికి చెప్పే వెళ్లాను కదా ఇంకా మీకు కాఫీ ఇవ్వలేదా ఏం చేస్తుంది అమ్మాయి అంటూ వంటగది వైపు అడుగులు వేసింది హైమావతి.
పోనీలే పనిలో ఉంది కావచ్చు నువ్వు వెళ్లి తీసుకురా అన్నారు నందిని మామగారు రఘురాం గారు. సరే లెండి ఎలాగో వెళ్తున్నా కదా మన ఇద్దరికీ తీసుకుని వస్తాను అంటూ కిచెన్ లోకి నడిచింది హైమావతి లోపలికి వెళ్లి అక్కడ దృశ్యం చూసి కెవ్వున కేక వేశారు.
ఆ కేక కు అదిరిపడిన రఘురాం గారు ఏంటి హైమా ఏమైంది అంటూ లోపలికి వచ్చారు. అక్కడి దృశ్యం చూసి ఆయన అవాక్కయ్యారు రెండు నిమిషాల్లో తేరుకొని నన్ను వెళ్లి బయట కూర్చో అంటూ చెప్పి భార్యను తీసుకు వచ్చి కుర్చీలో కూర్చోబెట్టారు.
ఆ తర్వాత గబగబా కిచెన్ లోకి వెళ్లి నందినితో మాట్లాడుతూ అమ్మా నందిని అంటూ పిలిచారు కానీ నందిని సృహా లో లేదు. నందినిని పరికించి చూసిన రఘురాం గారికి ఆమె చేతిలో కత్తి ఎడమ చేతిలో నుంచి రక్తం కారుతూ కనిపించాయి.
అది చూసి భయపడిన రఘురాం గారు గబగబా తన పంచను చింపిన చేతికి కట్టు కట్టారు అప్పటికే చాలా రక్తం పోయినట్లుగా ఉంది.
ఆ తర్వాత తన మొహం పై నీళ్లు చల్లుతూ నందిని నందిని అంటూ తట్టిలేపసాగారు అయినా నందిని అసలు పలకలేదు. ఏం చేయాలో అర్థం కాక ఆమెను అలాగే వదిలేసి బయటకు వచ్చి హైమావతి వైపు చూశారు.
హైమవతి గారు చాలా షాక్ లో ఉన్నారు. అసలు కదలకుండా అలాగే నివ్వెరపోయి కూర్చున్నారు. రఘురాం గారు తన కర్తవ్యం గుర్తుకు వచ్చినట్లుగా వెంటనే ఫోన్ తీసి అటు అంబులెన్స్ కి ఇటు వాసు కి ఫోన్ చేశారు.
ఫోన్లో విషయం వినగానే వాసు ఇప్పుడే వస్తున్నా నాన్న అంటూ బయలుదేరాడు. ఇంతలో అంబులెన్స్ రానే వచ్చింది. వాసు రాకముందే అంబులెన్స్ లో నందు ని తీసుకొని హాస్పిటల్ కి వెళ్ళారు రఘురాం గారు. హైమావతి గారు అంబులెన్స్ శబ్దం విని ఈ లోకంలోకి వచ్చి భర్తతో పాటు తను కూడా అంబులెన్స్ లో ఎక్కి వెళ్లారు.
హాస్పిటల్ కి వెళ్ళినా కూడా నందుకు సృహ రాలేదు. ఎమర్జెన్సీ కేస్ అని డాక్టర్లు కొంచెం త్వరగానే స్పందించారు. కానీ రఘు రామ్ గారికి ముందే ఒక విషయం చెప్పారు ఇది పోలీస్ కేసు అవుతుంది మీరు పోలీసులు అని పిలవండి అని చెప్పారు.
మేము ట్రీట్మెంట్ ఇస్తాం కానీ కచ్చితంగా పోలీసులు రావాల్సిందే అని చెప్పడంతో రఘురాం గారు పోలీసులకి కూడా ఫోన్ చేశారు. ఆయనకి చాలా ఆశ్చర్యంగా ఉంది నాలుగేళ్ల నుంచి ఎంతో సంతోషంగా ఉన్న నందు తమతో కూడా ఎంతో ప్రేమగా ఉండేది.
మా కోడలు ఇలా అనుకోకుండా ఎందుకు ఈ ఆత్మహత్య ప్రయత్నం చేసింది, భార్య భర్తల మధ్య ఏమైనా గలాటా జరిగిందో తనకు ఏమీ తెలియదు. తమ ముందు మాత్రం చాలా అన్యోన్యంగా ఉంటారు ఇద్దరు.
అలాంటిది ఇప్పుడు తను ఇలా చేసిందంటే నమ్మలేకుండా ఉన్నాడు. ఇప్పుడు పోలీసులు వస్తే ఎంత ఘోరంగా ఉంటుంది పరిస్థితి అసలు తామేదో ఆమెను హత్య చేసినట్లు అందరూ అనుకుంటారు ఇన్ని రోజులు ఉన్న మంచి పేరు అంతా పోతుంది.
ఈ విషయం తమ చుట్టాలలో హాట్ టాపిక్ గా అవుతుంది అని మరో పైపు ఎవరేమనుకున్నా మాకేంటి మా కోడలు బ్రతికితే చాలు అసలు ఇలా ఎందుకు చేసిందో కారణం తెలిస్తే చాలు అని అనుకుంటూ పోలీసులకు ఫోన్ చేశారు.
పోలీసు వాళ్లు విషయం విని ఆశ్చర్యపోయారు కోడలు ఆత్మహత్య ప్రయత్నం చేస్తే మామగారు ఫోన్ చేసి చెప్పడం ఏంటి అని అనుకున్నారు.
అయినా తమ బాధ్యత కాబట్టి హాస్పిటల్ కి వస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేసి ఐదు నిమిషాల్లో అక్కడ ఉంటాము అని చెప్పారు.
ఇంతలో వాసు హాస్పిటల్ లోకి ఎంటర్ అయ్యాడు దగ్గరగా వచ్చి ఏమైంది? నాన్న నందు కి ఏమైంది? ఇప్పుడు ఎలా ఉంది అసలు ఎందుకు ఇలా చేసుకుంది? అంటూ ఆదుర్దాగా అడిగాడు.
నన్ను అడిగితే నాకేం తెలుసు రా నేను రెండోసారి కాఫీ పెట్టమని మీ అమ్మగారిని పంపాను. నందినికి చెప్పి స్నానానికి వెళ్ళిందట నేను ఇంకా లోపలికి వచ్చి చూసే సరికి పరిస్థితి ఇది దాంతో అంబులెన్స్ కు నీకు ఫోన్ చేసి చెప్పాను ఇప్పుడు పోలీసులకు కూడా ఫోన్ చేశాను.
వాళ్ళు ఇంకో రెండు నిమిషాల్లో రావచ్చు అంటూ జరిగిందంతా వివరించారు రఘురాం గారు. పోలీసులా పోలీసులకు ఎందుకు నాన్నా అంటూ అడిగాడు వాసు.
ఆత్మహత్య ప్రయత్నం చేస్తే అది మన టార్చర్ లేకపోతే నీ టార్చర్ అని అన్నీ పోలీసులు ఎంక్వయిరీ చేస్తారు ఇది అంతటా జరిగేదే కొత్తగా ఏం కాదు.
అవును రా వాసు ఒక విషయం అడుగుతాను చెప్పు మీకు మీకు మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా నాలుగ్గోడల మధ్య ఏవైనా జరుగుతున్నాయా మాకు తెలియకుండా అంటూ అడిగాడు రఘురాం కొడుకుని…
తను చాలా మంచిది నేను తనని ఎంతో ప్రేమిస్తున్నాను. తను లేకుండా నేను ఉండలేను ఉండలేకపోతున్నాను. పొద్దున కూడా తన సంతోషంగానే నాకు బాక్స్ కట్టి ఇచ్చింది.
ఇంతలోనే ఇలా చేసిందంటే నేను అసలు జీర్ణించుకోలేకపోతున్నా అయినా ఏదైనా ఉంటే మీతో కాకుండా నేను ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఎలా ఉంటాను చెప్పండి అంటూ తన సందేహాన్ని తీర్చాడు వాసు.
అవునా మరి ఎందుకిలా చేసింది తను అయినా అమ్మాయి అమ్మాయికి మనకి మధ్య ఎలాంటి తగాదాలు లేవు మేము కూడా తనని కూతురు లాగా చూసుకుంటున్నాము ఇప్పుడు పోలీసులు వచ్చి ప్రశ్నలు వేస్తారు ఇంతకీ తన పరిస్థితి ఎలా ఉందో కొనుక్కుందాం పద అంటూ ఐసీయూ దగ్గరి కి వెళ్ళారు ఇద్దరూ.
ఇంతలో పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు మీరేనా రఘురాం గారు అంటూ అడిగాడు. అవునండి నేనే రఘురామ్ ని ఇతను మా అబ్బాయి వాసు ఇప్పుడు లోపల ఉంది ఇతని భార్య పేరు నందిని అంటూ చెప్పాడు.
చెప్పండి వాసు గారు అసలు ఏం జరిగింది మీరు తను ఏమైనా గొడవ పడ్డారా మీలో మీకు ఏమైనా తగాదాలు ఉన్నాయా అంటూ అడిగాడు ఎస్సై.
అలాంటివి ఏమీ లేదండి మేము చాలా అన్యోన్యంగా ఉంటాం మా అమ్మానాన్నలు కూడా తనని కూతురు లాగా చూసుకుంటారు ఇప్పటికిప్పుడు హ్యాపీగానే బాక్స్ కట్టి ఇచ్చింది కానీ ఇంతలోనే ఏమైందో తెలియదు అని చెప్పాడు.
దానికి ఎస్సై గారు ఏమో మీ ముందు బాగా నటించి తనని మీ అమ్మ నాన్న గారు టార్చర్ పెడుతున్నారు ఏమో ఎవరికి తెలుసు ఇంతకీ తనకూ ఫోన్ లాంటిది ఏమైనా ఉందా అంటూ అడిగాడు.
ఫోన్ ఏం లేదండి తను ఫోన్ వాడదు. ఏదైనా అర్జెంట్ పని ఉంటే ఇంట్లో ల్యాండ్లైన్ నుంచి చేస్తుంది లేదా నాన్నగారికి సెల్ఫోన్ ఉంది అందులోంచి చేస్తుంది.
నేను తనకి ఫోన్ కొని ఇస్తాను అన్నాను కానీ తను మాత్రం ఫోన్ ఉంటే దానికి అడిక్ట్ అవుతాం ఫోన్ వద్దు అంటూ ఇంట్లో ల్యాండ్ లైన్ పెట్టించుకుంది అంతే తన పని తాను చేసుకుంటుంది తప్ప ఎవరితోనూ గొడవపడే మనస్తత్వం కాదు అంటూ చెప్పాడు వాసు.
మరి మీ అత్త మామ గారికి ఈ విషయం చెప్పారా అంటూ అడిగాడు. తనకి అమ్మానాన్న లేరు రెండేళ్ల క్రితం ఒక యాక్సిడెంట్లో చనిపోయారు వాళ్లకి నందిని ఒక్కతే అమ్మాయి.
ఇంకా బంధువుల గురించి మాకు తెలియదు. అందరూ దూరపు చుట్టాలు ఉన్న వాళ్ళు పరిచయం లేదు ఇప్పటివరకు నన్ను చూడడానికి ఎవరూ కూడా రాలేదు అంటూ చెప్పాడు వాసు.
ఇంతలో లోపల్నుంచి డాక్టర్ గారు రావడంతో ఏంటి పరిస్థితి అంటూ అడిగారు ఎస్సై గారు. వాళ్ల ముగ్గురిని చూస్తున్న డాక్టర్ గారు పరిస్థితి ఏది మన చేతిలో లేదు చాలా రక్తం పోయింది.
ఆమె చాలా అలసటగా ఉంది మీరు ఏమైనా అడగాలంటే రెండు నిమిషాలు మీకు సమయం తర్వాత అంతా భగవంతుని దయ అంటూ చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్.
సరే తను ఏం చెబుతుందో విందాం అంటూ ముగ్గురూ లోపలికి వెళ్లారు. ఎస్సై గారు ఆమెని నందిని నందిని అంటూ పిలిచారు దగ్గరికి వెళ్లి నన్ను ఎందుకలా చేసావ్ ఏమైంది?
ఏంటి నీ సమస్య అసలు ఇంతవరకు బాగానే ఉన్నావు కదా అంటూ అడిగాడు వాసు. తను నెమ్మదిగా కళ్ళు తెరిచి ఉంది. వాసు ని చూస్తూ ఏమో నాకు ఏమి అయిందో తెలియదు నేను ఏం చేస్తున్నానో నాకు తెలియకుండానే నేను ఇలా చేశాను. అంది మెల్లిగా.
ఏంటి ఏం మాట్లాడుతున్నావు నందిని నీకు ఏం తెలియకుండా ఎలా చేస్తావు అసలిది నువ్వు చేసే పనేనా నీకేం సమస్య వచ్చిందని ఇలా చేశావు నన్ను అన్యాయం చేసి వెళ్తావా నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు చెప్పు అంటూ కళ్ళనిండా నీళ్ళతో అడిగాడు వాసు.
ఏమోనండీ నాకు ఏదైనా మీరే నాకు సమస్యలు ఏమీ లేవు నేను చాలా బాగా ఉన్నాను కానీ ఆ క్షణంలో నాకు ఏమనిపించిందో తెలియదు అత్తగారు మావయ్య గారికి కాఫీ కావాలని చెప్పారు.
ఆ తర్వాత నేను లోపలికి వెళ్ళాను కాఫీ కలుపుతూ ఉన్నాను కానీ అంతలోనే పక్కనే కత్తి కనిపించడంతో నేను ఏం చేస్తున్నానో నాకు తెలియలేదు కత్తితో నా చేతి పై గాట్లు పెట్టుకుంటూ ఉన్నాను.
అంత వరకే నాకు గుర్తుంది ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు అంటూ చెప్పింది నందిని. అది విన్న ఎస్ఐ ఆశ్చర్యపోతూ ఏంటి మేడం ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియని స్థితిలో ఉన్నారా?
అసలు ఇలా ఎక్కడైనా జరుగుతుందా? మీ మాటలు వింటుంటే నాకు చాలా విచిత్రంగా ఉంది అంటూ ఆమె మాట్లాడేది తన సెల్ ఫోన్ లో రికార్డు చేసాడు. నందిని ఎస్ ఐ ని చూస్తూ సార్ నిజంగానే నాకేమీ తెలియదు.
నాకు ఎలాంటి సమస్యలు లేవు నా అత్తమామలు నా భర్త చాలా మంచి వాళ్ళు నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు నేను కూడా అంతే ప్రేమతో చూసుకుంటున్నాను. నిజంగా ఆ క్షణం లో నాకు ఏం జరిగిందో తెలియదు నన్ను ఎవరూ ఆత్మహత్యకు ప్రేరేపించలేదు.
నేను ఆ కత్తిని చూడగానే ఏమనిపించిందో తెలియదు నాకు తర్వాత నొప్పి కూడా అవ్వలేదు. నిజంగా నాకు ఏమైందో నాకు తెలియదు మా అత్తమామలు మా వారు చాలా మంచివారు.
నా తల్లిదండ్రులు చనిపోయినప్పటి నుంచి నన్ను ఇంకా ప్రేమగా చూసుకుంటున్నారు దీనికి వాళ్లకి ఏ సంబంధం లేదు సార్ అంటూ చెప్పింది.
తర్వాత వాసు వైపు చూస్తూ నన్ను క్షమించండి నేను ఇది ఎందుకు చేశాను ఏం చేశాను ఎలా జరిగిందో నాకు అసలు తెలియదు నాకు కత్తి తీసుకోవడం వరకే గుర్తుంది.
మిమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళిపోతున్నా నన్ను క్షమించూ వాసు అంటూ తన చేతిని తన చంపకు అంటించింది. రఘురాం గారి వైపు చూస్తూ మావయ్య గారు నన్ను మీ బిడ్డల్లా చూసుకున్నారు చాలా సంతోషం మరో జన్మంటూ ఉంటే మీ కూతురిగా పుట్టాలని కోరుకుంటున్నా అంది నందిని.
నందు అంటూ బిగ్గరగా ఏడవసాగాడు వాసు. రఘురాం గారు కూడా కళ్లనీళ్లు పెట్టుకున్నారు. ఇదంతా చూస్తున్న ఎస్ఐకి కూడా కళ్ళల్లో నీళ్ళు రాసాగాయి ఇన్ని కేసులు చూసిన తనకి ఇంత ప్రేమగా ఉన్నా భార్య భర్తలు, అత్తమామలు ఎప్పుడు తారసపడలేదు.
ఈ కేసు కి వాళ్ళకి ఏ సంబంధం లేదని వీళ్ళ ప్రేమ ను చూస్తుంటే అర్థమవుతుంది. అన్ కాన్షియస్ మైండ్ తో చేసిన ఈ కేసును ఏమని రాసుకోవాలి అతనికి అర్థం కాక వాసు భుజం మీద చేతి వేసి ధైర్యం చెబుతున్నట్లుగా తట్టి అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కళ్ళు తుడుచుకొంటూ..
ఆ రోజు సాయంత్రం నందును ఇంటికి తీసుకు వచ్చారు. చివరిసారిగా తనకి అలంకరించి, చివరి చూపు చూస్తూ చేయవలసిన వన్ని చేశాడు వాసు. వారం రోజుల తర్వాత నందు లేని ఆ ఇంట్లో ఉండలేక ఆ ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంటికి మారిపోయారు వాసు అతని తల్లిదండ్రులు.
ఇంకా ఉంది..
– భవ్యచారు