చిటపటలు
మదినిండా అక్షరాలు తోరణం కట్టి
పరిమళాన్ని పంచుతున్నాయి
అది ఉదయం సమకూర్చిన ఉత్సాహం కావొచ్చు!
వాడిపోయిన పూలలా నిరాశా నిస్సత్తువలు
ఓ మూల దాగున్నాయంటే
అక్షరబలమే కారణమని మనసు గుసగుసలాడుతోంది!
వార్ధక్యపు బరువును మోస్తూ
విచారంతో ఉన్న ఆలోచనలను
చిటపటలాడుతో ఉదయపు ఎండ
విసుక్కుంటోంది !
-సి.యస్.రాంబాబు