చిరునవ్వు

చిరునవ్వు

ఇప్పుడు వున్న ప్రపంచంలో అత్యంత విలువైన వస్తువు ఏదైనా వున్నది అంటే

అందులో “చిరునవ్వు” అనే చెప్పాలి. ఆరోగ్యానికి అందానికి
స్నేహానికి చిరునవ్వే స్వాగతం కదా అంటే
ఇప్పటి టక్నాలజీ తో వచ్చింది నిజమే మరి.

ఒక ఊరిలో కాంతం’ శాంతం వుండేవారు.
అయితే కాంతం ఎప్పుడు పని సంపాదన అని ఆదుర్ధాతో వుండేది

ఎందుకంటే అందరికన్నా ఎక్కువ సంపాదించి డాబులు చెప్పుకోవాలని
“శాంతం” మాత్రం తన పని తాను చేసుకుంటూ
అందరితో చిరునవ్వుతో పలకరిస్తూ ఊరిలో
వారితో స్నేహంగా వుండేది. అందరిఅభిమానాన్ని
సంపాదించింది.
కాంతం మాత్రం పోటీపడుతూ పలకరించినా
సమాధానం ఇవ్వక చీటికి మాటికి అందరితో
గొడవ పడుతూ ఎవ్వరితో కలిసినా ముఖం
లో చిట్లింపులు ఈర్ష్య తో మాట్లాడేది. అది
తోటి వూర్లో వారికి నచ్చేది కాదు. నాకు డబ్బు
వుంది . మీతో ఏమిపని నాకు అని ఆహంతో
సమాధానం ఇచ్చేది. “శాంతం” మాత్రం శాంతంగా వుంది.

చాక చక్యంగా పనులు పూర్తి చేసుకుని ఇతరులకు కూడా సహాయ పడేది
మనసుతో పలకరిస్తూ నచ్చిన వారితో స్నేహంగా
వుంటూ కష్ట నష్టాలలో వూరి వారి సహకారంతో
సాఫీగా గడిపేది. కాంతానికి మాత్రం ఏదో చిరాకు
శాంతాన్ని అందరు బాగా చెప్పుకుంటారు అని
మనసులో ప్రత్యేకత ఏమిటా అని అర్దం కాలేదు
కాంతా నికి . ఊర్లో ఒకరోజు పండగ నాడు
అందరు కలిసి భోజనాలు చేస్తున్నారు అప్పుడు
శాంతం అందరితో ఆనందంగా అన్ని మరచి
చిరునవ్వుతో పలకరిస్తూ ఆభరణాలు లేకున్నా
చిరునవ్వుతో వెళ్లిపోయింది. కాంతం మాత్రం
నగలు ఆభరణాలు చూపిస్తూ ఎదుటివారితో
డాబు తో గొప్పలు చెప్పింది అయినా ఎవ్వరు
వినలేదు. వీళ్లకేం తెలుసు డబ్బు విలువ అని
కోపంతో వెళ్లి పోయింది.
అదేనండి కోపంతో వెళ్లి ఇంట్లో అద్దం ముందు
నిలబడింది ఏమిటి నా ముఖం ఇలా వుంది
అనుకుంటూ సమాధానం కోసం ఆలోచిస్తుంటే
“శాంతం” గుర్తువచ్చింది.
భాష లేని భావం చిరునవ్వు
చిరునవ్వుల సిరులు పండించుకోవాలి:-

– జి. జయ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *