చిరు వెలుగు

చిరు వెలుగు

ఎదురు చూస్తున్నది
యదను మోస్తున్నది
ఆతని తలపులతో

వసంతానివైరా ఆమనికై
చిరుగాలివైరా అలసటకై
వర్షానివైరా వలపులకై

అందమంటే పట్టింపు లేదు
నా అందమంటే
నను అందుకోమంటే

రా మెరుపువై
ఆ చిరు వెలుగులో
నా కనుల తడిని
తెలుసుకోరా…

– సత్య సాయి బృందావనం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *