చిరు చిరు పాపలం

చిరు చిరు పాపలం

1) చిరు చిరు పాపలం – చిన్నారి బాలలం
   నింగికి నేలకు నిచ్చెనలేసే-అల్లరి పిడుగులం //చిరు//

2) పూలదండలో దారంలా-మేమంతా కలిసుంటాం
   ఐకమత్యమే బలమని చాటుతు-ఏనుగునైనా బంధిస్తాం. //చిరు//

3) విశ్వమంతా విహరిస్తాం -కొత్తవెన్నోకనిపెడతాం
   భవషత్తంత బాలలదేనని -చేతల ద్వారా చూపిస్తాం //చిరు//

4) కల్లాకపటము ఎరుగని మేము -పెద్దలదీవెనలాశిస్తాం
   నిన్నకు రేపుకు సంధిగ నిలిచి -చిచ్చరపిడుగుల మనిపిస్తాం //చిరు//

– కోటా పెంటయ్య

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *