చిరంజీవి
నాకైతే చిరంజీవి గారి నటన చాలా ఇష్టం ఎందుకంటె అతని ఫేస్ ఎక్స్ ప్రెషన్లు బాగుంటాయి నటనలో ప్రావీణ్యం బాగుంటుంది..
తరువాత వెంకటేష్ గారు అతని నటన కూడా చాలా బాగుంటుంది
చిరంజీవి మెుదటి సినిమా పునాది రాళ్లు అయినప్పటికి చట్టానికి కళ్లు లేవు అనే సినిమా చూసిన తరువాత అతని సినిమా లంటె నచ్చేవి..
ఇప్పుడింకా చాలా మంచి హీరోలే వచ్చారు..అందరూ కూడా నటన లో శిక్షణ తీసుకుని చాలా బాగా నటిస్తున్నారు..
ఇక నాకింకా నా మనవడైతే పెద్ద హీరో!
వాళ్ల అమ్మ వాడికి తినిపించే టపుడు వాడు చేసే నటన చాలమ్మా! అంటూ కడుపు పట్టుకుని నొప్పి అంటూ చేసే అధ్బుత యాక్షన్ సూపర్..
ఇంక ఫోన్ చూడ వద్దని కోప్పడు తుంటె ప్లీజ్!ప్లీజ్! ఫైవ్ మినిట్స్ మా ( అమ్మను మా అంటాడు ) వాడు పెట్టే బుంగమూతి కమల్ హాసన్ నటనే ఇగ..వాడే ఇప్పుడు నా హీరో!
-ఉమాదేవి ఎర్రం