చినుకు దారం
స్వాతి ముత్యపు చినుకుల్లా
వానచినుకులు జ్ఞాపకాల చివుళ్ళు
కనిపించని దేవుళ్ళ ప్రతిరూపాలు
కలతీర్చే శుభాశీస్సులు
ప్రతిచినుకు మనసులోనూ
వేడుక చేయాలనే
నేలదాహం తీర్చాలనే తపనే
ఓపలేని ఆనందం ఒక్కోసారి శాపమవుతుంది
చినుకు దారం
రైతుకు ఆధారమయితే
కవికి ఊహల ద్వారం
మానవాళికి జీవనసర్వస్వం
సంవత్సరానికోసారొచ్చే మూడునెలల అతిథిని
మురిపెంగా చూసుకుందామని
తథాగతుడు సెలవిస్తున్నాడు
అతిథీ మమ్ములను హతవిధీ అననీకు సుమా
-సి.యస్.రాంబాబు
Very nice 👌👌👌