చిగురాశ
ఒకరోజు…
అలా సూర్యోదయం వేళ..
అటుగా నడుచుకుంటూ వెళ్తున్న నాకు ఒక్కసారిగా సూర్యుడు ఎందుకో చిన్నబోయాడు అనిపించింది…
కానీ వెలుగు ఏ మాత్రం తగ్గలేదు…. ఎందుకో తెలుసా…?
ఆ సూర్యుడి వెలుగు నీ మొహం లో అందంగా కనిపిస్తుంది..
నిన్ను చూసిన ఆ క్షణం ఒక్కసారిగా మనసులో ఏదో తెలియని అలజడి…
నీ నవ్వు చూడడం కోసం నా కళ్ళు ఎంతో ఆరాటపడుతున్నాయి.
పదే పదె నిన్నే రూపాన్ని తలపిస్తున్నాయి….
ఎందుకో తెలీదు అడుగు ముందుకు పడటం లేదు..
బహుశా నువ్వు దూరం అవుతావు అనేమో…
కను రెప్ప వేయడం లేదు నువు మాయం అవుతావు అనేమొ…
కానీ ఆ రోజు ఆ క్షణం నాలో చిగురించిన ఆశ నీతో కలకలం ఉండాలని జీవితాంతం బ్రతకాలని…
నేటికీ నిజం అయిన వేళ నా కళ్ళ ముందు నా ఆశ నెరవేరిన వేళ నీకే జన్మ దాసోహం అయిన వేళ ఈ వేళ…
– వనిత రెడ్డీ