చెప్పుడు మాటలు – ఆగని అసూయలు
చెప్పుడు మాటలు
చేతనైనంత చేటు చేస్తాయి
చెవులకు
ఇంపుగావుంటాయి కానీ
నీడకి- నిజానికి తేడావలె
చెప్పేవాళ్ళు ఆచరణకు
ఆమడదూరంలో వుంటారు
విశ్వాసానికి విఘాతంలా
అనర్థాలకు
అంతులేనిదారిలా
కలహాలకు కారణంమై
అవగాహన అసలే లేక
ఆలోచించని వివేకంతో
నిర్ధారణలేని నిర్ణయాలై
అపార్థాల ఆజ్యంగా
తప్పొప్పులు తారుమారై
చిచ్చుల చిత్రాలుచూపిస్తూ
అంతస్థుల
అంతరాలుపెరిగి
ఆగని అసూయలుగామారి
ఆరోపణల
అస్త్రాలుగా చేరి
అపహస్యానికి
దగ్గరగా చూసి
సందేహాలే
సమస్యలుగాతెచ్చి
సరిదిద్దు కోలేని
తప్పుగామారి
జీవితాలను
తలక్రిందులుగా మార్చి
విలువైన సమయాన్ని
కోల్పోయి వినడంమాత్రమే
బలహీనతగా మారి
మనశ్శాంతి కోల్పోయి
అశాంతి మిగులుతుంది
చెప్పుడు మాటలు చెప్పేవారి కంటే వినేవారికే
నష్టం ఎక్కువ
విన్నా పెడచెవిన పెట్టాలి కానీ పెడార్థాలుగా మారకుండాచూసుకోవడం
మంచిదే కదా మరి అందరికీ…..?
– జి జయ