చెప్పుడు మాటలు

చెప్పుడు మాటలు

ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉండే దంపతులు.. ఎంతో ప్రేమతో.ఆనందం తో అసలు ఒకరి మీద ఒకరికి కోపం అనేది ఎలా ఉంటుందో కూడా తెలీదు… అందరికీ వారు ఆదర్శం లా కనిపించేవారు.. ఇలా ఉండాలి భార్య భర్తలు అంటే అనేలా ఉండేవారు. అలాంటి వారి దాంపత్యం లోకి ఒక వ్యక్తి అనుకోకుండా వచ్చాడు.

ఎంతో ప్రేమగా ఉన్న వారి మధ్య దూరం పెంచాలని.. ఎవరి కన్ను పడిందో కానీ.. ఏనాడు..మొహం కూడా చిన్నబుచుకోని .ఆ దంపతులు కన్నీట మునిగారు… ఆ వ్యక్తి ఎలా అంటే వీరిద్దరి మధ్య వీరికి తెలియకుండా.. ఓ అనుమానం అనే పెనుబూతన్ని సృష్టించాడు.. ఆమె అందరితో కలవిడిగా ఉండేది.. అందరూ నా వాళ్ళే అనే స్వభావం కలది..

అందరినీ సోదర భావం తో చూసి కలిసి పోయేది.. దాన్ని ఈ మూడో వ్యక్తి తన భర్తకి చెడుగా సృష్టించి చెప్పేవాడు.. ఉన్నది ఉన్నట్లు కాకుండా ఎలాంటి సంబంధం లేని మాటలతో.. తనకు నమ్మకం కలిగేలా చెప్పేవాడు.. అసలు ఎవరు ఆ మూడో వ్యక్తి.. ఆమె ఆత్మ సౌందర్యాన్ని కాకుండా తన శరీరాన్ని కోరుకున్న మూర్ఖుడు..
తను దక్కలేదని స్వార్దం తో తన సంతోషాన్ని చెరపడానికి వచ్చాడు…

కానీ వాడి మాటలు ఆమె భర్త ఎంత చెప్పిన తన భార్య మీద ఉన్న నమ్మకంతో వాడి మాటలు నమ్మలేదు… వాడి బుద్ది బయట పెట్టీ కొట్టి పంపిస్తారు.. ఆ దంపతులు… తన భర్త మంచి వాడు కాబట్టి భార్య మీద ఎనలేని ప్రేమ ఉంది కాబట్టి.. తన బంధాన్ని తను నిలుపుకున్నడు… మంచి చెడూ ఆలోచించ గలిగాడు.. ఇద్దరు సంతోషంగా ఉన్నారు ..

అదే చెప్పుడు మాటలు విని ఉంటే వారి బంధం ఈ రోజు విడి పోయి ఉండేది..

అందుకే చెప్పుడు మాటలకు దూరంగా ఉండండి.. ఎవరు ఏ ఉద్దేశం తో మీకు ఎం చెప్తున్నారు.. అందులో ఎంత నిజం ఉందనేది గ్రహించండి.. ఇలాంటి మాటలు విని ఎంతో సంతోషం గా ఉన్న జీవితం లో ఇబ్బందులు కొని తెచ్చుకోకండి..

– వనిత రెడ్డీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *