చెలిమి
ఊహ తెలియకమునుపే అమ్మతోటి సాన్నిహిత్యం….
కాస్త పెరిగాక నాన్నతో ఆటలాడు అల్లరితనం….
బడికిపోయాక తోటి విద్యార్ధులతో మంచితనం….
మనకంటూ భావాలను పంచుకునేందుకు పరిచయం….
వయసు పెరుగుతున్నప్పుడు పెరుగుతూనే…
మనస్పర్ధల అలకలతో విసుగుతూనే…
చేసే అల్లరుల స్థాయిలలో వ్యత్యాసాలతోనే….
సంతోషాలని మూటకట్టి వరంగా ఇచ్చేస్తుంది….
ఎందరున్నా మనసుకు దగ్గరయేది ఒక్కరే….
మంచిచెడులు తెలిపేది వారు ఒక్కరే…..
పొగడ్తలకు మురియనీయక దారిచూపేది…
కృంగిననాడు తోడుంటూ చేయిపట్టి నడిపేది….
చిన్నతనం నుండి ముదుసలి వరకు ప్రతి వయసుకు తోడుంటూ…
స్వార్ధమెరుగక నిస్వార్ధంగా మెలుగుతూ…
చేయిపట్టి నడిపించును నీకెందుకు నేనున్నానంటూ…
స్మృతులనెన్నొ అందించును మనసునిండా…
కలిసిరాని కాలంలో వేదనెందుకు నేనుండగ అంటూ…
కష్టం తలుపు తట్టినవేళ తానే ముందుంటూ…
బతుకంతా బంధంగా అనురాగం పంచుతూ….
అందరకూ తోడుండును చెలిమి సంతకం చేస్తూ….
-ఉమామహేశ్వరి యాళ్ళ