చెలి

చెలి

ప్రపంచం ఎక్కడుంటే ఏమి
చెలి పక్కనుంటే చాలు మరి

హృదయవీణ మీటిన రాణి
నీ తలపే మధురానుభూతి
మేఘాల మెరుపులు
చెలి రాకను చేరవేస్తే
మది మొత్తము ఎదురచూపు
కాలాన్ని ఆగ మన్నను
పాదాలను సాగమన్నను
హాయి గొలిపే స్పర్శ కోసం
చెలి కన్నుల సైగకోసం
సన్న జాజుల చలువకోసం
చందమామ ముఖం
అందాల చెలి వలపు
పిలుపు
చెంత చేరితే సుమగందాల
భరితం
చెలి నడకల నాట్యము
అలరించే ఆస్వా దం

చెలి మౌనమే నాకు
చెప్పలేని మౌన బాధ మరి ….

 

– జి జయ

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *