చీకట్ల కళ్లాపు!!
మామలిద్దరాయె,
నడిమిట్ల నేనైతి తరాజు.
నా మొగ్గు నీవైపే మామ
ఓ, నా చందురూడా………!
నా మోమును దిద్దుకుంటి.
నిన్ను చూడ సరిచేసుకుంటి.
రాతిరిని వేడుకుంటి,
చల్లని చీకట్ల
కళ్లాపు జల్ల వేగిరముగా ………….!
నీ చలువ చూపులు చూసి,
నే చల్ల బడుట మరిచితిని
రాతిరి వంట పొయ్యినెక్కక బాయె.
మెడ నెత్తి చూసి
మైమరిచి పోతిని,
మెడ నొప్పి పుట్టంగ
మెట్లెక్కి మేడనెక్క బోతె,
నా మేనమామ,
నాకన్నా
ఎవరెక్కువే నీకని
నా చేయి పట్టి లాగే………..!
దోసిట నీళ్ళు నింపి
కనులారా నిన్ను చూడ
నిను నిల్ప నా యత్నం
బొట్టు, బొట్టుగా కారి,
నన్ను నీరుగార్చే…………!
– వాసు