చెదిరిన కల
నీ రూపం మరపురానిది
మదిలో మరచిపోలేని నీ ఉసులు
అందమైన నీ నువ్వు , నేను నిన్ను మర్చిపోలేను
నిద్రలో కల వచ్చిన నా కనురెప్పలు తెరిస్తే
చెదిరిన కలగా మిగిలిపోతుందేమో అని
నా మనసు భయపడుతూ…
అందమైన కల వచ్చిన అన్ని నెరవేరవు
అన్నిటికంటే పెద్ద సమాధి మా మనసు
ఎన్నో కలలు , ఎన్నో బాధలు , ఎన్నో ఊహలు
కానీ అది ఎవరినికి కనిపించదు…
కన్న వారి కోసం కలలు కంటూ
ఉన్న ఆశలను ఒంటరి చేస్తూ
అందమైన కలలు కన్న జీవితంలో ఒక మలుపు వల్ల
ఎటు వైపు వెళుతుందో ఎవరికి తెలియదు…
ఒక కల ఎంతో ఉన్నంతగా ఎదగాలని తపిస్తూ
నా జీవితం అందరికీ ఆదర్శం కావాలని
కలలు రాలే కాలం , జీవితంలో ఎదురవుతున్న వాటిని శాశ్వతంగా ఉండవు…
– మాధవి కాళ్ల