చరిత్రను తిరగ రాస్తే
సమస్యల వలయంలో చిక్కుకుపోయి ఉక్కిరి బిక్కిరి అవుతున్న సమయంలో రక్తసంబంధం తెగిపోయింది అనుకున్న వారి నుండి పెళ్లి పత్రిక అందింది.
రాకరాక వచ్చిన అతిధి మాట కాదని నిర్లక్ష్యం చేస్తే మళ్లీ నేను తన ఎదుట పడినప్పుడు మొఖం చాటేసుకునే పరిస్థితి వస్తుంది. లేక ఇంతటితో బంధం కట్ అయిపోతుంది.
లేదు నేను ఎలాగైనా వెళ్లి తీరాలని నిర్ణయించుకొని ఆరోగ్యం సహకరించకపోయినా ఇంట్లో వాళ్ళను ఒప్పించి మరి శుభకార్యానికి వెళ్లాను.
అక్కడ నా తోబుట్టువు నాకు ఒక స్త్రీ మూర్తిని పరిచయం చేసింది.ఆరడుగుల అందాల నెరజాన ముఖం చూడగానే సరస్వతీదేవి ఇలా అనిపించింది తనతో స్నేహం చేయాలనిపించి తన చరవాని నంబర్ తీసుకొని తనతో స్నేహం చేశాను. తను రచయిత మా స్నేహం రోజురోజుకు పెరుగుతూ పోయి, తన రచనలు నేను చదువుతూ, నాకు రాయాలని ఆశ కలిగింది నా ఆలోచన తనతో చెప్తే, తనే వచ్చి నాకు రచన అక్షరాభ్యాసం చేయించింది. తద్వారా నా చరిత్రను తిరగ రాస్తే తను ఎంతో సంతోషపడుతుంది.
ఆ ఆఅవకాశాన్ని కల్పించినందుకు తనకు జీవితాంతం రుణపడి ఉంటా.
-బేతి మాధవి లత