చరిత్రని తిరగరాస్తే
చరిత్ర కాగితం అయితే
తెల్ల కాగితం మీద సిరా చుక్కతో వర్తమాన
చరిత్రను తిరగరాయచ్చు అనేది సత్యం
సంకల్పమే సహకరిస్తే
సామర్ధ్యాల సాహసంతో
మారే ప్రపంచంలో మార్పు కోసం
ఆగని కాలంతో పోటీ పడుతూ
కష్టానికి ఎదురొడ్డి
మార్గానికి బాటలు వేసి
ఆశకు రూపం తెచ్చి
బాధను బందీ చేసి
నిరాశను నిలువునా పాతేసి
ప్రయత్నాన్ని నమ్ముకుని
పడి లేచే కెరటాలై
సహనాన్ని సంధించి
లక్ష్యానికి సూటి పెట్టి
భవిష్యత్తుకు భాష్యం చెబుతూ
మనుషులలో మాలిన్యం చెరిపి
సంకల్పాన్ని సాధనం చేసి
ఆశయే ఆయుధంగా
కృషినే పెట్టుబడిగా
విశ్వాసాన్ని సడలించక
విఘ్నాలను తొలగించి
విజ్ఞానంతో ముందుకెళ్లి
అలుపెరుగని కృషితో
అదృష్టం వెంట నడిస్తే
చరిత్రను తిరగ రాయవచ్చు అనేది అక్షర సత్యం……
_ జి జయ