చరిత్రలో నీకొక పేజీ

చరిత్రలో నీకొక పేజీ

మనిషి పుట్టడం, పెరగడం తర్వాత ,పెళ్లి అంటూ తన పనేదో తాను చేసుకుంటూ సాధారణ జీవితం గడుపుతూ ఉంటారు. వారి వారి ఆచారాల పరంగా జీవనం సాగిస్తూ ఉంటాడు. తన జీవితం,తన కుటుంబం తాను బాగున్నానా, లేనా, నా కుటుంబం బాగుందా ? లేదా ? అనేదే చూస్తాడు. తప్ప ఏదో సాధించాలి.అందరికీ నా పేరు తెలియాలి.

చరిత్రలో నేను నిలిచిపోవడం అని ఆలోచించే వారు ఎవరూ లేరు. ఎందుకంటే .. పొద్దున లేచింది మొదలు ఉద్యోగానికి పరుగులు అక్కడ బండెడు చాకిరీ. తర్వాత ఇంట్లో పిల్లలూ,భార్యా భర్త అత్తమామల గొడవలు. ఇవ్వన్నీ చేసొచ్చి అలసి పోయి కాస్త తిని పడుకుందాం అనుకుంటే పిల్లలు కథ చెప్పవా అంటూ గోల .

నిజంగా ఇది చదువుతున్న మీరు చెప్పండి మీరు ప్రశాంతంగా నిద్రపోయి ఎన్ని రోజులు అవుతుందో… కదా అందుకే లక్ష్యాలు,ఆశయాలు చరిత్రలో నిలిచే అంత ఆలోచన ఎవరికీ ఉండదు.

ఎక్కడో నూటికో కోటికో ఒక్కరు ఉంటారు. వారి లక్ష్యం కోసం తమ జీవితాన్ని అంకితం చేసి తమ లక్ష్యం కోసం పోరాడి, తాము చరిత్రలో చిలిచి పోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు.

చివరికి ఆ లక్ష్యం నెరవేరొచ్చు లేదా మధ్యలోనే వాళ్ళు చనిపోవచ్చు. అలా చరిత్రలో నిలవాలి మనకంటూ ఒక పేజీ ఉండాలి. అందుకే నా ఈ అక్షర లిపి ప్రయత్నం,నాతో ప్రయాణం చేస్తూ సహకరిస్తూ ,మీరు రాసే రచనలు అన్నీ చరిత్రలో నిలిచిపోతాయి.ముందు తరాలకి మార్గదర్శనం అవుతాయని నమ్మకం తో ముందుకు సాగడమే మన లక్ష్యం..

-భవ్య చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *