చరిత్రతిరగరాస్తే
చరిత్రను తిరగరాయాలి అని ఆలోచన మంచిదే. చరిత్రలో అంటే గతంలో ఉన్న మనుషులు మన వారి మనస్తత్వాలు ఎలాంటివి ఒకరికొకరు ఎలా సహాయం చేసుకునేవారు. వారి ఆహారపు అలవాట్లు వారి వస్త్రధారణ అనేది మనకు తెలుస్తుంది.
మేము చదువుకున్నంత వరకు మాత్రం రాజుల కాలంలో ప్రజలు సుభిక్షంగా ఉండేవారని, ధర్మం, న్యాయం, నీతి, నిజాయితీ అనేవి చాలా పటిష్టంగా ఉండేదని. రాజు ఏది చెప్తే ప్రజలు అదే చేసేవారని చదువుకున్నాం.
అప్పటి కాలానికి వెళితే ఇప్పుడు ఉన్నట్టుగా కల్తీ ఆహారం ఉండదు. మంచి బలవర్ధకమైన ఆహారం మనకు దొరుకుతుంది. అలాగే వస్త్రధారణ కూడా సగం చిరిగిన బట్టలు కాకుండా, ముందుగా తొమ్మిది గజాల చీర కట్టుకొని వంటలు చేసి కింద కూర్చుని భోజనం చేసే పద్ధతులు తెలుస్తాయి.
అప్పటి బంధాలు ,బంధుత్వాలు అప్పటి కల్మషం లేని ప్రేమ అనేది మనకు తెలుస్తుంది, ఇప్పుడున్న స్వార్థం అప్పుడు లేదు.. ఇప్పుడున్న మోసం అప్పుడు లేదు. పైకి నవ్వుతూ మాట్లాడి లోలోపల నాశనాన్ని కోరుకునే వారు లేరు.
ఇక ఆచారాలు సాంప్రదాయాల విషయానికి వస్తే మడి తడి అంటూ ముట్టు అంటూ ఎన్నో ఆచారాలు ఉన్నాయి అవన్నీ మన మంచికే అని ఆయుర్వేదం చెప్తుంది.
మడి కట్టుకొని వంట చేస్తే ఎలాంటి బ్యాక్టీరియా మన దరి చేరవు అని తెలుస్తుంది. పేడతో కల్లాపు చల్లి పిoడి తో ముగ్గులు వేయడం వల్ల అటు బ్యాక్టీరియా రాకుండా ఇటు చిన్న జీవులకు ఆహారాన్ని అందించడం అనేది జాలి, దయా, కరుణ అని చెప్పవచ్చు.
ఇక పెద్దల పట్ల చూపించే గౌరవం ఇప్పుడు లేదు. ఇప్పుడు పెద్దలు నిల్చుంటే, పిల్లలు సిట్లలో కూర్చొని బస్సులో ప్రయాణిస్తున్నారు. కానీ అప్పుడు పెద్దలు అంటే ఎంతో గౌరవించేవారు. వాళ్లు అంటే పెద్దలు అక్కడి నుంచి వస్తున్నారంటే ఇక్కడే వంగిని వారికి పాదాభివందనాలు చేసుకునేవారు. ఇప్పుడు పచ్చి బాలింత అన్న కనికరం కూడా లేకుండా కింద కూర్చొని పాలిస్తున్న ఎవరు శ్రద్ద చూపించడం లేదు. అనేది మనం పేపర్లలో, టీవీలో చూసాము.
అప్పట్లో ఈ టీవీ, ఫోన్లు లేవు కాబట్టి అందరూ కలిసి కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయడం, అది కూడా మీతో భోజనం చేస్తూ నీతి ,నిజాయితి, జీవితం లో ఎలా ఉండాలో నేర్పిస్తూ భోజనం చేసేవారు. అలాగే పొద్దున్నే బ్రహ్మీ ముహూర్తంలో లేవడం, ఆసనాలు వేయడం ద్వారా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చేసేవారు.
కానీ ఇప్పుడు అడ్డమైన గడ్డి తింటూ ,ఒళ్ళు పెంచుతూ ,మళ్లీ అవి కరిగించుకోవడానికి జిమ్ముల వెంట పరుగులు తీస్తున్నారు. బజ్జీలు, పిజ్జాలు అంటూ కొవ్వున్న పదార్ధాలు తింటూ రోగాలను తెచ్చుకుంటూ ఆసుపత్రి పాలు అవుతున్నారు.
నేనే కనుక చరిత్ర తిరగ రాస్తే ఆ పాత పద్ధతులన్నీ మళ్లీ అమలులో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. తప్ప ఇప్పటి కాలాన్ని సమర్థించను… అలాంటి కాలం మళ్లీ వస్తుందని, రావాలని అది నేను చూడాలని ఆశిస్తూ… సెలవు
– భవ్య చారు