చరితలో దాగినవి….
పేరు మోసిన మేనులవి…
మేడిపండు చందనా….
చరితలో నిలిచిన వాక్కులవి
ఎన్ని కుత్తుకలు తెగ్గోసేనో….!
చరితలో దాగినవి
కదలాడేది… సజీవ మానవరూపం
నరనరనా దాగిన వికృత దానవమృగం
సమాజంపై పట్టిన చీడపురుగులై…
కన్నీటిని దాచేసే గుఱ్ఱపు డెక్కలవి…
చరితలో దాగినవి
రూధిరాన్ని మోయలేని భూదేవి…
ఎర్రమృతికై వెలసినది….ఒకచోట
కాలిన దేహాలపై ఆరిన నిప్పులు…
నల్లమృత్తికలు మరోకచోట….
చరితలో దాగినవి
గొంతు దాటాని రోదనలు…
దేహంలో రేపే అలజడులు….
అల్లకల్లోలా సముద్రాలు….
అణగారిన ప్రజల గుండెలు
చరితలో దాగినవి…..
ఎన్నో మరెన్నో….
ఏ కాలం… కనికరించెనో….
ఏ కలం …. వెలికితీసేనో
చరితలో దాగినవి…….
– కవనవల్లి