చందమామ
అందమైన చందమామ
దరిచేరిన చందమున
చూడ తనివి తీరునెపుడు
ఈ చీర అన్నావు ఆ చీర అన్నావు
అవెందుకడ్డ మనుకొంటి నీ
అందములచూడ
చూపుల కేముండెనడ్డు
పెదవులకు ఏమి వుండె
తనివి తీరగ నీ తనువు ఒంటరిగ చూడ
తనువు పులకరించు తన్మయత్నమున
తనివి తీరగ,చెపుదు నువు చీర కట్ట
తనివి తీరునెపుడు! నే చెప్పుటెపుడు!
– రమణ బొమ్మకంటి