చాంద్ కా తుక్డా

చాంద్ కా తుక్డా

 

రసూల్ చిన్న వ్యాపారస్తుడు.బజారులో రకరకాల పళ్ళు అమ్ముతూ ఉండేవాడు. అతని కూతురు నూర్ ఎంతో అందమైన అమ్మాయి. అందరూ ఆమెను చాంద్ కా తుకడా అంటారు. చాంద్ కా తుకడా అంటే చాలా అందమైన మోము కలది అని అర్థం. ఎలాగైతే చంద్రుడు అతిసుందరంగా ఉంటాడో అలాంటిచంద్రుని వంటి మోము కలది అని ఆ వాక్యార్ధం. అందరూఅలా పొగుడుతుంటే ఆమెకుగర్వంగా ఉండేది. నూర్ తల్లికిమాత్రం భయంగా ఉండేది. అదిసహజంగా ప్రతి తల్లిదండ్రులకుఉండే భయం లాంటిదే. రసూల్తన కూతురుని కంటికి రెప్పలాకాపాడుకుంటూ ఉండేవాడు.నూర్ ఒక కాలేజీలో చదివేది.

చక్కగా చదువుతుండటం వల్ల ఆమెకు స్కాలర్షిప్ కూడా ఇచ్చారు. అలాంటి సమయంలో ఐక అనర్ధం జరిగింది. తను అంటే ఇష్టపడేరహీమ్ తో నూర్ ప్రేమలో పడింది. ఆమెకు చదువుపట్ల శ్రద్ధ తగ్గింది. రహీమ్కూడా చెడ్డవాడేమీ కాదు. అయినా కూడా ఇద్దరిచదువు దెబ్బతింటుంది కదా.అప్పుడే వారి లెక్చరర్ రమేష్వారిని పిలిచి. “చూడండి పిల్లలూ, ఏ వయసులో ముచ్చట ఆ వయసులోతీర్చుకోవాలి. ఇప్పుడు మీరు చదువుకునే వయసు. చక్కగాచదువుకుంటే మీకు మంచిభవిష్యత్తు ఉంటుంది కాబట్టిచక్కగా చదువుకోండి. చూడురహీమ్,నీకు ఈ చాంద్ కా టుకడా దొరకాలంటే బాగాచదువుకోవాలి. మంచి ఉద్యోగం దక్కించుకునిఆమెను సుఖాల్లో ముంచెత్తాలి.రహీమ్ కు విషయం అర్ధం అయ్యింది. నూర్ భవిష్యత్తు,తన భవిష్యత్తు బాగుండాలిఅంటే చదువు కోవటం మంచిదిఅని నిర్ణయించుకున్నారు. ఆగురువుగారు చెప్పినట్లే మంచిఉద్యోగం సాధించి ఆ చాంద్ కాటుకడాను పెళ్ళిచేసుకుని సుఖంగా ఉన్నాడు.

-వెంకట భానుప్రసాద్ చలసాని.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *