ఛాయ్
పొద్దుగాల లేచి ఛాయ..
తాగుదామని..
టీ స్టాల్ కెళితే..
వాడు ఛాయ ఇచ్చె..
కానీ దాంట్ల ఈగ పడి సచ్చె..
అయినా బిల్లిచ్చి ఛాయ్ పారబోసి..
టిఫినన్న తిందామని హోటల్..
కెళితే..
వాడు ఇడ్లికి సాంబార్ తెచ్చె కానీ..
దాంట్ల బల్లి పడి సచ్చె..
వాడు చూడక తెచ్చె..
నేను చూసి నా ఆకలి సచ్చె..
కడుపు మాడిపాయె..
ఆకలి సచ్చిపాయె..
ఇంటి దారి పట్టుడాయె..
ఎవరు పిలవక పాయె..
-ఉమాదేవి ఎర్రం..