చదువు – సంస్కారం
1. ఆ.వె.
చదువు వల్ల కలుగు సంస్కార భాగ్యంబు
చదువు వల్ల చట్ట సభలు నడుపు
చదువు వల్ల నబ్బు జనహిత మార్గమ్ము
చదువు ఎల్లవేళ శాంతి గూర్చు
2. ఆ.వె.
విద్య నేర్చుకున్న వినయంబు పెరుగాలి
ఒదిగి యుండు టెల్ల కొదువ గాదు
గర్వ మెప్పుడైన కష్టాల పాల్జేయు
అణకువ సుగుణాల కాటపట్టు
3. ఆ.వె.
నేర్చుకున్న చదువు నీలోనె దాయకు
నిరుపయోగమగును నీకు కూడ
పంచుకున్న కొలది ఫలమధికమ్మగు
తోట బావి జలము తోడినట్లు
4. ఆ.వె.
శాస్త్రవేత్తవయ్యి శాషించు విశ్వాన్ని
మానవతను చాటు మార్పు తెచ్చి
అక్షరాస్యులైతె అన్నియూ సాధ్యము
దేశమాత మురిసి తేజరిల్లు
5. ఆ.వె.
అక్షరాస్యుడవయి అవనిని కాపాడు
విజ్ఞతలను పంచు విశ్వమంత
పంచ భూతములను పాలించు సమముగా
విస్మరించ వలదు విశ్వ శాంతి
– కోట