సెల్ పోయింది
మోహన్ మార్కెటింగ్ చేస్తుండేవాడు. అతనిదగ్గర ఒక స్మార్ట్ ఫోనుంది.కస్టమర్లకు ఫోన్ చేసి వారినిఒప్పించి తన కంపేనీ సరుకులుఅమ్మేవాడు. మోహన్ తన మార్కెటింగ్ పనిమీద తిరుగుతూ ఉండేవాడు.అలాంటి సమయంలో అతని సెల్ఫో న్ పోయింది. సెల్ పోతే అతని ప్రాణం పోయినంత పని అయ్యింది. ఎందుకంటే ఫోన్లో కష్టమర్ల ఫోన్ నంబర్లతో పాటు
వారు ఆర్డర్ చేసిన మెటీరియల్వివరాలు కూడా ఉన్నాయి. వెంటనే ఇంటికి వెళ్ళి ముందుఇంటిలో వెతికాడు. అతని ఫోన్ దొరకలేదు. ఆ తర్వాతఆఫీసుకు వెళ్ళి అక్కడ కూడా
వెతికాడు. ఫోన్ అక్కడ కూడాలేదు. మోహన్ కు టెన్షన్మొదలయింది. అతనికిఅవసరమైన సమాచారంఅంతా ఆ పోయిన ఫోన్లోఉంది. కొత్త ఫోన్ కొనేపరిస్థితి లేదు. అలాంటిఫోన్ కొనాలంటే చాలాడబ్బులు కావాలి. ఫ్రెండ్ ఫోన్ తీసుకుని తన నెంబరుకు ఫోన్ చేసాడు. రింగ్ అవుతుందికానీ ఎవరూ ఎత్తడం లేదు.మోహన్ కు పిచ్చెక్కినట్లైంది.
ఏడుపే తక్కువ. పోలీసు స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వమనిమితృలంతా సలహా ఇచ్చారు.ఆ పనీ చేసాడు మోహన్. అలాపోలీసు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినీరసంగా మంచం మీద పడుకుని కళ్ళు మూసుకునిఆలోచించసాగాడు. అప్పుడుహటాత్తుగా అతనికి ఒక విషయం గుర్తుకు వచ్చింది.ఆ రోజు ఉదయం బాత్రూంలోస్నానం చేసేప్పుడు ఫోను అక్కడ గూట్లో పెట్టడం అతనికిఅలవాటు. ఎక్కువ సార్లుసెల్ఫోన్లో పాటలు కూడావింటుంటాడు. అది అతనిపర్సనల్ రూమ్ కాబట్టికుటుంబ సభ్యులు రారు.అది గుర్తుకు వచ్చి మోహన్పరిగెత్తుకుని వెళ్ళి బాత్రూమ్లోచూసాడు. అక్కడ సరంబీమీద అతని సెల్ఫోన్ ఉంది. మోహన్ఆనందానికి అవధులు లేవు.మొత్తానికి ఫోన్ దొరికింది. కధ సుఖాంతమైంది. బాత్రూమ్లోస్నానం చేసేప్పుడు సెల్ఫోన్ పాటలు వినేవారు స్నానం అయ్యాక ఫోన్ బయటకు తీసుకుని వెళ్ళకపోతే ఇదేపరిస్థితి. ఫోన్ పోయిందంటూ ఇల్లు పీకి పందిరెయ్యవద్దు.
ప్రశాంతంగా ఆలోచిస్తే ఆఫోన్ ఎక్కడ పెట్టారో మీకే గుర్తుకు వస్తుంది.
-వెంకట భానుప్రసాద్ చలసాని