బుట్టబొమ్మలు
కళ్లకు కాటుక పెట్టి..
నుదుటన బొట్టును దిద్ది..
చెవులకు బుట్టాలు పెట్టి..
కాళ్లకు పట్టీలను పెట్టి..
ఘల్లు ఘల్లుమని వచ్చింది..
వచ్చిందెవరా? అని చూస్తే..
అదే నా చిన్నప్పటి ..
బుట్టబొమ్మ సంధ్య..
ఒకటేమెా సంధ్య అయితే..
దాని చెల్లి జ్యోతి ..
తనకు తోడుగా వచ్చింది..
ఇవి రెండు నేను చిన్నప్పుడు..
ఆడుకున్న చిన్ననాటి బుట్ట బొమ్మలు..
-ఉమాదేవి ఎర్రం..