బ్రతుకు మాట – బంగారు పూల బాట

బ్రతుకు మాట – బంగారు పూల బాట

శోధన లో
వేదన లో
రోదన లో
కన్నీటి చాయిలలో
కష్టాల గమ్యము లో
సామాన్యుని బ్రతుకు వేట
తెలుసుకొని చిందులాట
శ్రీరాముని కె లేదు కష్టాల మూట
మనకేమిటి అంటున్న సామాన్యుని బాట
మూఢనమ్మకాలు ఒకవైపు
సామాజిక ఇతి బాధలు ఒకవైపు
శ్రామికుని మరో ప్రపంచం
సామాన్యుని గగన విహారం
తలుచుకుంటే విడ్డూరం
కానీ ఆడపిల్ల మగ పిల్లడు గా నిలబడగలరు
ప్రతి వాడికి కూడా గౌరవం గలదు
అయితే కష్టపడితే సాధించగలం
కష్టేఫలి విజయం ప్రాప్తిరస్తు
జీవితం విజయాల బాట చూడాలి
ఎవరినో చూసి చింతించకు
లక్ష్యాన్ని గురి చేసుకుని నడువు
పడిపోయిన 100 సార్లు పడిన నూట ఒక్కసారైనా లెగు
ఆ విజయం పడిపో నిధి మల్ల రాగలదు
విడిపోయిన జంటలు కలవగలరు
పోయిన డబ్బు తిరిగి రాగలదు
కన్నీటి వెతలు తీరగలవు
బ్రహ్మాండ ప్రపంచం రాగలదు
దానికోసం నిరీక్షిద్దాం
అంతు చిక్కని మరో ప్రపంచం రావాలి
దివ్యాంగులు కూడా సంతోషించగలరు
కూలిపోయిన నాటి మాట
నేడు అంకురార్పణం కట్టు
అంకితమై లక్ష్యాన్ని వదలకు
సామాన్యనిగా ఉన్న మనము
సాధిస్తాం బ్రహ్మాండం
ఆరోజు నా బ్రతుకు మాట
ఆత్మహత్యలు వదిలిన బంగారు పూల బాట

– యడ్ల శ్రీనివాసరావు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *