బ్రతుకు దారి
బ్రతుకు దారిలో..
అడ్డంకులు ఎన్నో..
ముళ్ల కంచెలు ఎన్నో..
ఎత్తి పొడుపులు ఎన్నో..
ఆటంకాలు ఎన్నో…
వెటకారాలు ఎన్నో..
ముందో మాట వెనకోమాట..
మాట్లాడే తీరులెన్నో..
వేసే నిందలెన్నో..
అపవాదు లెన్నో..
అడ్డు పడే మనుషులెందరో..
చెడిపోతే నవ్వే వాళ్లెందరో..
బాగు పడితే కుళ్లుకునే..
వారెందరో..
పైకెదుగుతే ఈర్ష్య పడే ..
వాళ్లెందరో..
ఇలాంటి సమీజంలో..
ముళ్లకంచెలు ఉంటే..
తొలగించి వెళ్లొచ్చు..
మనుషులను ఏం చేసి..
మార్చచ్చు?
ఎలా బ్రతకచ్చు?
బ్రతుకు దారేది?
ఇంత మందిలో నిలబడి..
నీ బ్రతుకు దారిలో నువ్వు..
నడవాలి..
ధైర్యే సాహసే లక్ష్మిగా..
నిలవాలి..నిన్ను చూసి..
నవ్విన వాళ్లే..
నీ వెనక తిరగాలి…
– ఉమాదేవి ఎర్రం