బ్రతుకు అంధకారం చేసుకోకు
ధర్మ పరివర్తనులు తిరుగాడిన భూమి ఇది
నలుదిశలా న్యాయం పరిడివిల్లిన ధరణి ఇది
నేడు నిరంకుశుల చేతిలో నలుగుతూ ధ్యుతి
కోల్పోయిన ఖరమల్లే భాసిస్తోంది నేటి భూమి భారతి
ఆధునిక పోకడలతో అశ్లీలతలతో సహజీవనం చేస్తూ
భవితను అంధకారం చేసుకుంటున్నారు నేటి యువత
పరిశ్రమలకోసం పచ్చటి పైరులను ప్రధ్వంసము చేస్తూ
వ్యర్ధ జలాలతో నదులను కలుషితం చేస్తూ
గృహావసరాలకు వనాలను నాశనం చేస్తూ
సంపదల కోసం భూమిని త్రవ్వి, కొండలను పిండి చేసి
సహజ రక్షక కవచాలను నిర్వీర్యం చేస్తూ
విపరీత పోకడలతో విధ్వంసాలను సృష్టిస్తున్నాడు
భవిత గురించి బెంగలేని నేటి ఆధునిక మనీషి…
అతివ పట్ల గౌరవాన్ని విస్మరించి, స్మర శర విలాసముల
సొగసు మదిని ఆక్రమించగా స్త్రీని విలాశ వస్తువును చేశారు
జ్ఞానం లేని విజ్ఞాన ఘనులమని చెప్పుకునే ఘనాపాఠీలు
విపరీత స్వార్ధ ప్రయోజనాలే నేటి వినాశాలకు ప్రతిరూపాలు
మేలుకో ఓ మనిషీ, మేలుకో
– గంగాధర్