బ్రతికేద్దాం
బ్రతుకేగా బ్రతికేద్దాం
ఏదో అలా సాఫీగా
ఎలాగో అలాగా
భారం అనుకుంటానో
దూరం అనుకుంటానో
క్షేమం అనుకుంటానో
లాభం అనుకుంటానో
భ్రమ అనుకుంటానో
కల అనుకుంటానో
మాయ అనుకుంటానో
మమతాను బంధాలు,
అనుకుంటానో….
బంధాల బందీ అనుకుంటానో
కలత పడి ఉలిక్కిపడి
కలలతో కన్నీళ్లతో కష్టాలతో
ఆకలితో ఆవేదనతో ‘
బాధతో బాధ్యతతో
ఆశలతో అల్పసంతోషాలతో
బ్రతికేద్దాం బ్రతికేద్దాం
బ్రతుకు పోరు సాగిద్దాం… !!
-సైదాచారి మండోజు