బికారినై
ఎడారిలో ఎండమావినై..
అన్నీ ఉన్న ఏమీ లేని బికారినై..
ఎంత మంది బంధువులున్న..
ప్రేమ కోసం యాచిస్తున్న ..
యాచకురాలనై..
అయినా ప్రేమ..
దొరకని అల్పురాలనై..
శ్రీమంతపు సిరిని నేనే..
అనుకుంటున్న లోకంతో..
పోటీ పడుతూ బ్రతుకు..
సాగిస్తున్న ఒక అమాయకపు..
జీవిని నేనే!!
అన్నీ ఉన్నాయి అందరూ ఉన్నారు..
అవసరానికి మాత్రం పనికి రారు..
ఆదర్శాలు మాత్రం వల్లె వేస్తారు..
అదే ఈ లోకం తీరు!!
మనుషుల జోరు!!
-ఉమాదేవి ఎర్రం